ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను

కామారెడ్డి, జనవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ( 25-1-2025) కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్‌ ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. ఇట్టి కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని ప్రకటనలో తెలిపారు.

15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం (25-1-2025) స్థానిక నిజాం సాగర్‌ చౌరస్తా వద్ద ఉదయం 9 గంటలకు మానవహారం ఏర్పాటు చేయనున్నారని రెవిన్యూ డివిజనల్‌ అధికారి, ఈఆర్‌ఒ రంగనాథ్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, పాఠశాలల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రకటనలో తెలిపారు.

Check Also

రైతు మహోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »