నిజామాబాద్, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో గల 9వ అదరపు జిల్లా మహిళా న్యాయమూర్తి పై జీవిత ఖైది అనుభవిస్తున్న ఒక ముద్దాయి దాడి చేయడం నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 14వతేదీ శుక్రవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లేపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు.
ఈ దాడి న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. దాడికి బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోర్టులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.