కామారెడ్డి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రతీ శుక్రవారం వాటరింగ్ డే కార్యక్రమాన్ని తప్పని సరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున స్థానిక కళాభారతి ముందుగల మొక్కలకు నీటిని పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతీ శుక్రవారం మొక్కలకు నీటిని పొయాలని, ముఖ్యంగా ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా నాటిన మొక్కలు, చెట్లకు నీటిని పోయాలనీ అధికారులను ఆదేశించారు.
పట్టణంలోని పార్క్ లు, మీడియన్, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు వాటరింగ్ చేయాలని మున్సిపల్ సిబ్బందికి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఏఈ శంకర్, తదితరులు పాల్గొన్నారు.