వేల్పూర్, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం వేల్పూర్ మండలంలోని వేముల సురేందర్ రెడ్డి మెమోరియల్ హాల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రగతి శీల రైతు అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డి.జి.యం ప్రఫుల్ కుమార్ జెన హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, అగ్రికల్చర్ ఇన్ఫ్రా, ఇంప్లీమెంట్స్, వాటిపై లోన్స్ గురించి అవగాహన కల్పించారు.
మహిళా సంఘాలకు కూడా పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎప్పుడు ముందు ఉంటారని చెప్పారు. అదేవిధంగా ఏ.జి.యం మన్యం శ్రీకాంత్ మాట్లాడుతూ రైతులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని సూచించారు. అభివృద్ధిలో తమ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం ఉండాలని చెప్పారు.
దానితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ యాసిడెంట్ ఇన్సురెన్సు కవర్ అయిన శెట్టి మహేష్ భార్య శెట్టి లతకు డి.జి.యం చేతుల మీదుగా 20 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ రవి నాయక్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ అదేవిధంగా ఐ.కె.పి ఏ.పి.యం కిరణ్ కుమార్, సి.సిలు రవి, ప్రకాష్, ప్రవీణ్, నర్సయ్య, మురళి, ఆఫీస్ స్టాఫ్ నవీన్ కుమార్, ప్రసాద్ వి.ఓ.ఏలు పాల్గొన్నారు.