వేల్పూర్, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో పాటు అన్ని గ్రామాలలో పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థిని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కరోణ వైరస్ కారణంగా గత 16 నెలల తర్వాత పాఠశాలలు పున ప్రారంభం కావడంతో పాఠశాలలను గ్రామపంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో సైతం పిచ్చి మొక్కలు తొలగించడం జరిగిందని, శానిటైజర్ చేయడం జరిగిందని వివరించారు.
పాఠశాలలకు వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు వైరస్ పై అవగాహన సదస్సు కల్పించామని, విద్యార్థులు ఎలాంటి జ్వరం కానీ, జలుబు, దగ్గు ఉన్నట్లయితే ఉపాధ్యాయులకు తెలపాలని సూచించారు.