సిపియస్‌ విధానాన్ని రద్దు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబందించిన సిపిఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తపస్‌ జిల్లా శాఖ పక్షాన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తపస్‌ జిల్లా శాఖ అధ్యక్షులు పులగం రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

తపస్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా అన్ని మండల కేంద్రాలలో తపస్‌ శాఖ పక్షాన అన్ని తహశీల్దార్‌ కార్యాలయాలకు వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని పంపించడం జరుగుతుందన్నారు. ఈ రోజు అనగా సెప్టెంబర్‌ ఒకటిన ఉద్యోగుల విద్రోహ దినంగా పాటించడం జరుగుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాఘవరెడ్డితో పాటు నాయకులు లక్ష్మన్‌ రావు, రామచంద్రము, భాస్కరచారి, ఆంజనేయులు, లక్ష్మీపతి, రాజా శేఖర్‌, దత్తాచారి, గిరి తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »