కామారెడ్డి, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫేదార్ శోభ రాజు అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 15 వ తేదీ బుధవారం నాడు ఉదయం 10.30 గంటలకు నూతన కలెక్టరేట్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.సాయాగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు సమావేశానికి సకాలంలో హాజరు కావాలని ఆయన ప్రకటనలో కోరారు.