కామారెడ్డి, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అధికారుల మధ్య సమన్వయ సహకారంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు జిల్లా అధికారులకు సూచించారు.
బుధవారం జిల్లా అధికారుల సంక్షేమ సంఘం డిస్ట్రిక్ ఆఫీసర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు ఉన్నారు. వారి సమక్షంలో సంఘం కార్యవర్గం నియమించబడిరది. అధ్యక్షులుగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఆర్. రాజారామ్, వైస్ ప్రెసిడెంట్లుగా జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన అధికారి సంజీవరావు, జనరల్ సెక్రెటరీగా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.దయానంద్, కోశాధికారిగా జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ ఎం.సతీష్ యాదవ్, జాయింట్ సెక్రటరీలుగా జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి ఆర్. సునంద, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా జిల్లా విద్యా శాఖ అధికారి రాజు, జిల్లా పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరానందరావు, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, పబ్లిసిటీ సెక్రటరీగా జిల్లా పౌరసంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీగా జిల్లా యూత్ ఆఫీసర్ వై.దామోదర్ రెడ్డి, కార్య నిర్వాహక సభ్యులుగా జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి జి. రజిత, జిల్లా మత్స్యశాఖ అధికారి జి.వెంకటేశ్వర రావు, జిల్లా ఖని భూగర్భ శాఖ ఏడి నర్సిరెడ్డి, జిల్లా బిసి సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజశేఖర్, జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ వసంత, జిల్లా వైద్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శేషారావు, జిల్లా పశువైద్యాధికారి జగన్నాథ చారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య నియమించబడ్డారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సంఘం ముఖ్య ఉద్దేశం అధికారుల మధ్య సంబంధాలు, ప్రభుత్వ పథకాలలో సమన్వయంతో విజయవంతం చేయడం, జిల్లా యంత్రాంగానికి సహాయకారిగా ఉండటం అని, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను జిల్లా అధికారుల కృషితో కామారెడ్డి జిల్లాలో రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేందుకు అధికారులు విశేష కృషి చేయాలని కోరారు.