వేల్పూర్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘననివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిదని, పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని, రైతులు పండిరచిన పంటకు మద్దతు ధర రావాలని దళారులనుంచి విముక్తి కల్పించి రైతులు మోసపోవద్దని ఆలోచనతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి దని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికొక ఉద్యోగం అని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఇవ్వలేదని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ అని మోసం చేస్తున్నారని, డబుల్ బెడ్ రూమ్ కడుతున్నా పూర్తిగా నాణ్యత లోపంతోనే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ నిదుర మత్తు వదిలి పేదప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో మండల బిసి అధ్యక్షులు రమణ, వేల్పూర్ టౌన్ అధ్యక్షులు నరేందర్, జిల్లా జనరల్ సెక్రెటరీ దామోదర్ గౌడ్, ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ రాజేంద్ర, మండల కిషన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగయ్య, నాయకులు మల్లేష్, మాణిక్యం, లింగన్న, ఆర్మూర్ మోహన్, మల్లయ్య, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.