వేల్పూర్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రాజధాని ఢల్లీిలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం శంకుస్థాపన సందర్భంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెరాసపార్టీ జెండా పండుగను మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల వాణి, ప్రజల సమస్యలను ఢల్లీి వరకు వినిపించాలని ఉద్దేశంతో మన దేశ రాజధాని అయిన ఢల్లీిలో టిఆర్ఎస్ పార్టీ భవన్ శంకుస్థాపన చేస్తున్నందుకు శుభసూచకమని అన్నారు. తమ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, అదేవిదంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోటా జెండా పండుగ వాతావరణం కనిపిస్తుందని, అలాగే కెసిఆర్కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.
సీఎం కేసీఆర్ అమలు పరిచిన పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తూ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళుతున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.