నిజామాబాద్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోని పిఆర్ రోడ్‌లో ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో పిఆర్ రోడ్స్‌లో ఎవిన్యూ ప్లాంటేషన్‌పై సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవెన్యూ ప్లాంటేషన్‌లో పంచాయతీ రాజ్ రోడ్స్‌కు ఇరువైపుల 5 మీటర్ల మొక్కలు ఉండాలని ఆ విధంగా లేని చోట ఆ గ్రామ పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్‌కి తెలియజేయాలని వారు వినకుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. పెట్టిన మొక్కలు వెంట వెంటనే మెయింటైన్ చేయాలని నాలుగువందల మొక్కలకు వన సేవకుని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
మీ ఫోకస్ అంతా వెళ్లేటప్పుడు రోడ్లపై మొక్కలు చూడాలన్నారు. ప్రతి జిపి పరిధిలోని రోడ్ల వెంట మొక్కలు బాగుండాలన్నారు. మంచి మొక్కలు 5 ఫీట్లు ఉన్న మొక్కలు పెట్టాలన్నారు. ప్రతి రోడ్డు నీటుగా ప్లాంటేషన్ కావాలని ప్రొటెక్షన్ కోసం ట్రీ గార్డ్ ఏర్పాటు, వీడిరగ్ బుష్ క్లియరెన్స్ చేయించాలన్నారు. వచ్చే సంవత్సరం ఎవిన్యూ ప్లాంటేషన్ అనే మాట ఉండొద్దని కేవలం మెయింటెనెన్స్ మాత్రమే ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.