హైదరాబాద్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరికొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఈనెల 4 నుంచి వెబ్ ఆప్షన్లు మొదలై 13తో ముగియాల్సి ఉంది. విద్యార్థులు ధ్రువపత్రాలను పొందేందుకు ఇబ్బందులు పడుతుండటంతో కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని ఉన్నత విద్యామండలికి కొన్ని సంఘాలు వినతిపత్రాలు ఇచ్చాయి.
దానికితోడు జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ప్రక్రియ సైతం పూర్తికాలేదు. ఆయా కళాశాలలకు వర్సిటీ అనుమతి ఇస్తేనే కౌన్సెలింగ్‌లో వాటిని చేరుస్తారు. ఈ క్రమంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 4వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం లేనట్లేనని స్పష్టమవుతోంది.