కామారెడ్డి, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన 154 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని దొర పాలనకు అంతం పలకాలని అన్నారు. ప్రజల పక్షాన పోరాటానికి బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారని యాత్రకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని పేర్కొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామగ్రామాన అధికార పార్టీ విధానాలకు విసిగి పోయిన యువకులు పెద్ద ఎత్తున బీజేపీ వైపు చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు. దోమకొండ మండల కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున చేరికలు కావటం ఆనందంగా ఉందని ఇదే స్ఫూర్తి రాబోయే ఎన్నికల వరకు కొనసాగాలన్నారు. చేరికల అనంతరం పార్టీ జండా ఆవిష్కరించారు.