కామారెడ్డి, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు రక్తదాతల సమూహ నిర్వాహకుడు బోనగిరి శివకుమార్‌ను సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన హిందువాహిని జిల్లా కార్యదర్శి సాయి ప్రణయ్ చారి సహకారంతో వారికి కావాల్సిన ఏ పాజిటివ్ రక్తం అందజేశారు.
ఈ సందర్బంగా బోనగిరి శివకుమార్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో ఉన్న వారికీ మానవతా దృక్పధంతో రక్తదానికి ముందుకు రావడం చాలా అభినందనీయం, స్ఫూర్తిదాయకమని రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో సమూహ ప్రతినిధులు కొత్మీర్ కార్ రామకృష్ణ, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషన్ రాజు పాల్గొన్నారు.