వేల్పూర్, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సహకారంతో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందని, విద్యార్థులు నిర్భయంగా, స్వచ్చందంగా పాఠశాలకు రావాలని వ్యాయామ ఉపాధ్యాయురాలు కాశిరెడ్డి సునీత పేర్కొన్నారు.
వేల్పూర్ మండలం లక్కోరా గ్రామ ప్రభుత్వ పాఠశాల గత 18 నెలల తర్వాత ప్రారంభం కాగా రెండవ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని అధిక సంఖ్యలో పాఠశాలకు హాజరయ్యే విధంగా సహకరించారన్నారు. పాఠశాలలో మొత్తం 50 మంది విద్యార్థులు ఉండగా మొదటి రోజు 9 మంది, రెండో రోజు 29 మంది ఇలా రోజురోజు విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. దీంతో బోధన సాఫీగా సాగుతుందన్నారు.