కామారెడ్డి, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మెంబర్ తానోబా సుమిత్రానంద్ను కామారెడ్డి జిల్లా విద్యార్థి నాయకుడు గడ్డం సంపత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమిత్రానంద్కు చిత్రపటాన్ని అందజేసి టీఎస్ పీఎస్సీ కమిటీలో సభ్యురాలిగా నియామకం కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు మరింత వేగవంతంగా కమీషన్ ఆద్వర్యంలో ఆయా శాఖల్లో ఖాలీలను గుర్తించి వివిద స్థాయి హోదాలకు సంబందించి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని వినతిపత్రం అందజేశారు.
అనేక మంది నిరుద్యోగ యువత ఆత్మానున్యత భావనలో ఉన్నారని, కొలువుల కోసం ఎంతోమంది నిరీక్షిస్తున్నారన్నారు. ఉద్యోగాల భర్తీని వేగవంతంగా చేపట్టేలా కమీషన్ చర్యలు తీసుకునేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. త్వరలోనే కమీషన్ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.