బోధన్, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్, పార్ట్ టైం, పుల్ టైం సిబ్బందితో పాటూ స్కీం వర్కర్ల వేతనాలను పెంచిందని, వాటిని మున్సిపల్ కార్మికులకు అమలు చేయడం లేదని, వెంటనే మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బోధన్ మున్సిపల్ కమిషనర్ రామలింగంకు మున్సిపల్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర నాయకులు బి.మల్లేష్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జే. శంకర్ గౌడ్, కార్మిక ప్రతినిధులు జే. మక్కయ్య, భూమయ్య, సవిత, గంగామని, మరియ, రేణుక, సాయమ్మ, పోసాని, ప్రభాస్, సంజీవ్, గోపి తదితరులు పాల్గొన్నారు.