గణేష్‌ మండలి నిర్వాహకులు పాటించవలసిన నియమాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక ప్రతిమలు ప్రతిష్టించే గణేశ్‌ మండగలి నిర్వాహకులకు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ పలు సూచనలు చేశారు. గణేష్‌ విగ్రహ ఏర్పాటు కోనం వ్రజల నుండి డబ్బులను బలవంతంగా వనూలు చేయరాదని, గణేష్‌ మండపాలను ఎవరికి ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేనుకోవాలని, మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం నంబంధిత వారితో అనుమతి తీసుకోవాలని, గణేష్‌ మండళ్ల వద్ద నందర్శించే మహిళలపై , యువతులపై ఈవ్‌ టీజింగ్‌ జరుగకుండా చూడాలన్నారు.

ప్రజలకు అసౌకర్యం కలుగకుండా డి.జె / డి.జె మిక్సర్స్‌ / హై ఫిడిలిటి (హైఫై) సౌండ్‌సిస్టమ్‌ ఇక్విప్‌మెంటు విషయంలో చాలా జాగ్రతలు వహించాలని, కొద్ది మంది ఇండ్లలో గుండె జబ్బులు గలవారు, బి.పి గలవారు, వయను పైబడిన వృద్దులు ఉంటారని, అలాగే చదువుకునే విద్యార్థులకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీనుకోవాలన్నారు.

రాత్రి 10 గంటలకు లౌడ్‌ స్పీకర్లు ఆఫ్‌ చేయాలని, ఈ విషయంలో నుప్రీంకోర్డు నిబంధనలను పాటించాలని, డి.జే లు వూర్తిగా నిషేదం, మైక్‌ అనుమతి కోనం నంబంధిత ఎ.సిపిని నంప్రదించి తప్పని సరిగా తీనుకోవాలని, విధ్యుత్‌ సరఫరా ఆగకుండా, వీధి దీపాలు వెలిగేటట్లు చూడాలన్నారు. గణేష్‌ మండపాల కొరకు విద్యుత్‌ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్‌ తీసుకోవాలని, షార్డు నర్కూట్‌ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉవయోగించాలని, ప్రజలకు అసౌకర్యం కలుగజేసే ఎటువంటి చిన్న నమాచారాన్ని అయిన మీ దగ్గరలోని పోలీనులకు తెలపాలని, లేదా డయల్‌ 100 కు ఫోన్‌ చేయాలన్నారు.

ప్రతీ గణేష్‌ మండలి వద్ద ఉదయం, రాత్రి వేళలో ఇద్దరూ లేదా ముగ్గురికి తక్కువ కాకుండా తమ కార్యకర్తలను మండలి వద్ద ఉంచాలని, పోలీస్‌ వారు తనిఖీకి వచ్చినప్పుడు ప్రతీసారి కనబడాలన్నారు. ప్రతి గణేష్‌ మండలి దగ్గర విధిగా పాయింట్‌ పుస్తకం ఏర్పాటు చేనుకోవాలని, పోలీను అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారన్నారు.

అపరిచిత వ్యక్తుల గూర్చి నమాచారం తెలియజేయాలని, మీ దగ్గరలో ఎవ్వరైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్‌ సంచులు వదిలినట్లయితే వాటిని తాకరాదని, అట్టి నమాచారం దగ్గరలోని పోలీస్‌ అధికారులకు తెలపాలన్నారు. గణేష్‌ మండలి మొక్క వూర్తి వివరాలు, నిమజ్జనం కొరకు ఏరోజు, ఎక్కడికి, ఏ మార్గం ద్వారా తీసుకువెళ్తారనే నమాచారం నంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు ముందుగానే తెలపాలని కమీషనర్‌ పేర్కొన్నారు.

గణేష్‌ ప్రతిమలు కూర్చుండబెట్టే వ్రదేళంలో షెడ్‌ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్‌ ఏర్పాటు చేయాలని, పై భాగంలో రేకులు, ప్లాస్టిక్‌ కవర్లతో ఏర్పాటు చేయాలని, వర్షపు నీరులోపలికి రాకుండా ఉండడంకోనం, గణేష్‌ ప్రతిమలు కూర్చుండబెట్టే వేదిక చాలా బలంగా ఉండేటట్లు చూనుకోవాలని, మేకలు, ఇతర జంతువులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గణేష్‌ మండలి వద్ద వూజా కార్యక్రమంలో క్యూ పద్దతి పాటించాలని, బారికేడ్లను విధిగా ఏర్పాటు చేనుకోవాలని, వ్రత్యేకంగా లైటింగ్‌ సౌకర్యం కోనం మంచి నాణ్యత గల వైరుతొ ప్లాస్టిక్‌ పి.వి,సి పైప్‌ ద్వారా లైటింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేనుకోవాలన్నారు.

పూర్తి నురక్షితమైన కవరుతో ఉన్న ఫ్లడ్‌లైట్లను మాత్రమే వాడాలని, గణేష్‌ మండళ్ల వద్ద ఎప్పుడైన అగ్ని వ్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు, రెండు బకెట్ల ఇనుక ఏర్పాటు చేసుకోవాలని, యువకులు కోపతాపాలకు వెళ్లకుండా సంయమనం పాటించే విధంగా చర్యలు తీనుకోవాలని, ఎటువంటి రూమర్స్‌ (పుకార్ల) ను నమ్మరాదని, వ్రజలకు అసౌకర్యం కలుగ కుండా నిరంతర పోలీస్‌ నిఘా ఏర్పాటు చేయబడిరదని, సంబంధిత నిర్వాహకులు అవనరం నిమిత్తం ఉవయోగించుటకొరకు మీ దగ్గరలోని పోలీస్‌ సిబ్బంది ఫోన్‌ నెంబర్లను వ్రాసి పెట్టుకోవాలన్నారు.

వీలైనంతవరకు మట్టి మరియు తక్కువ ఎత్తుగల గణపతులను ప్రోత్సహించాలని, పర్యావరణాన్ని కాపాడాలని, నిర్వాహకులు మండపాల దగ్గర వచ్చే భక్తులను క్యూలో నిలబెట్టాలని, వారి వాహనాలను వద్దతి ప్రకారంగా పార్కింగ్‌ చేయించాలన్నారు. గణేష్‌ భక్తులు, నిర్వాహకులు మద్యపానానికి దూరంగ ఉండాలని, గణేష్‌ మండళ్ల వద్ద పేకాట ఆడరాదని, గణేష్‌ ఉత్సవాలలో టపాసులు నిషేదం ఉందని, నిమజ్జనం రోజు పోలీను వారు జారీ చేసిన నియమ నిబంధనలు పాటిన్తూ విగ్రహ రథాన్ని క్యూలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ రథానికి లైటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేనుకోవాలని, నిమజ్జనం రోజు వీలయినంత వరకు చిన్న పిల్లలు ఉండకుండా చూసుకోవాలన్నారు.

ఎక్కువ జననమూహం ఉన్నప్పుడు దొంగతనాలకు ఆస్కారము ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిల్లర దొంగలపై జాగరూకత వహించాలని, విలువైన వన్తువులను ధరించకూడదని, నిమజ్జనం రోజు భజన కార్యక్రమం చేసేవారు నంబంధిత దాన్ని అనుకరిన్తూ భక్తి భావంతో మెలగాలని, నిమజ్జనం రోజు వారి వారి అనుకూలనుసారం బావులలో, చెరువులలో, కాలువలలో లేదా గోదావరిలో మొదలగు చోట్ల వేసేటప్పుడు పెద్దవారు మాత్రమే ముందుకు వెళ్లి విగ్రహన్ని నిమజ్జనం చేయాలని, ప్రత్యేకంగా ఈత వచ్చిన వారు ఉండాలని సూచించారు. నిమజ్జనం రోజు కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లలు వెళ్ళడం జరుగుతుంది అలా కాకుండా ప్రతీ గణేష్‌ను నిమజ్జనం చేసే రోజు తప్పక పెద్దవాళ్లు ఉండాలని, ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలన్నారు.

కొన్ని మారుమూల గ్రామాలలోని ప్రజలు గ్రామ శివారులో గల చెరువులో లేదా నీటి గుంతలలో గణేష్‌ నిమజ్జనం చేయాడానికి వ్రయత్నిస్తారు. అటునంటి వాటిలో గతంలోనే ప్రోక్లేన్స్‌ ద్వారా పెద్ద పెద్దగా మట్టిని తీసీవేయడం వలన అక్కడ నీరు ఎక్కువగా నిలువ ఉన్నా కానీ కొద్దీగా ఉన్నట్లు కనబడుతుందని, కావున ఇటువంటి ప్రదేశాలలో నంబందిత పెద్ద వారు సరిjైున జాగ్రత్తలు తీనుకోవాలన్నారు. నిమజ్జనం చేసే నమయంలో ఎవ్వరు కూడా సాహసాలు చేయకూడదని, ప్రజలు పోలీనులకు ఎల్లప్పుడు సహకరించాలన్నారు. అదేవిధంగా ప్రజలందరూ కోవిడ్‌ నిబంధనలు తూ.చ తవ్పకుండా పాటించాలని సిపి కార్తికేయ సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »