హైదరాబాద్, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళా వృత్తి నిపుణులకు శుభవార్త. ఐటీ రంగంలో 2-5 సంవత్సరాల అనుభవం కలిగిన మహిళల కోసం మెగా ఉద్యోగ మేళాను ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రారంభించింది. ‘నైపుణ్యం, సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళా వృత్తి నిపుణులు తమదైన ముద్ర వేసే అవకాశాన్ని టీసీఎస్ కల్పిస్తోంది.
ఈ కార్యక్రమం మహిళల ప్రస్తుత నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికే కాదు.. నచ్చిన విభాగంలో మరిన్ని ప్రత్యేక నైపుణ్యాలపై పట్టు సాధించేందుకూ ఉపయోగపడుతుందని తెలిపింది. సులభమైన ఒకే విడతలో అయిపోయే ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తి చేసి.. మంచి హోదాలు పొందవచ్చని టీసీఎస్ వివరించింది.
నియామక ప్రక్రియ, అర్హతలు ఇలా..:
దేశవ్యాప్తంగా నియామకాలు జరుగుతాయి. డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, 2-5 ఏళ్ల అనుభవం కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలు వారి రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు వస్తాయి.
ఈ నైపుణ్యాలు అవసరం..:
ఎస్‌క్యూఎల్ సర్వర్ డీబీఏ, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మిన్, మెయిన్‌ఫ్రేమ్ అడ్మిన్, ఆటోమేషన్ టెస్టింగ్, పర్‌ఫెర్మాన్స్ టెస్టింగ్ కన్సల్టెంట్, యాంగ్యులర్ జేఎస్, ఒరాకిల్ డీబీఏ, సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, జావా డెవలపర్, డాట్‌నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఐఓఎస్ డెవలపర్, విండోస్ అడ్మిన్, పైథాన్ డెవలపర్, పీఎల్ ఎస్‌క్యూఎల్.