కామారెడ్డి, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా గాంబిరావ్ పెట్ మండలం గజ సింగవరం గ్రామానికి చెందిన వాణి అనే మహిళకు ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం ఉందని కామారెడ్డి రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్, రామకృష్ణలను వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. కాగా రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రాని సమయంలో పేషెంట్ తండ్రి నారాయణను గ్రూప్ సభ్యులు రక్త దానం వల్ల కలిగే ఉపయోగాలు తెలియజెసి అవగాహన కల్పించారు.
దీంతో కూతురికి తండ్రి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ వర్ష కాలంలో సిసనల్ డెంగ్యూ లాంటి వ్యాధులతో చాలా మందికి రక్తం అవసరం ఉంటుందని, ఎవరికైనా రక్తం అవసరముంటే ముందుగా కుటుంబ సభ్యులు రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రంగ నరేష్ గౌడ్, శ్యామ్ కుమార్, విటి ఠాగూర్ రక్తనిధి కేంద్రం నిర్వాహకులు చందన్ తదితరులు పాల్గొన్నారు.