కామారెడ్డి, సెప్టెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 38మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు.
గ్రామంలో పార్టీ జండా ఆవిష్కరణ అనంతరం వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై, రాష్ట్ర రథసారథి బండి సంజయ్ న్యాయకత్వంలో పని చేయటానికి పార్టీలో చేరారన్నారు. తన పై నమ్మకంతో బీజేపీలో చేరిన ప్రతి యువకుడికి 24 గంటలు అందుబాటులో ఉంటానని, రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి లో బీజేపీ కాషాయ జండా ఎగర వేసి దొర ప్రభుత్వానికి మొదటి పతనం కామారెడ్డి నుండే ప్రారంభిస్తామని అన్నారు.
ఈ నెల 22 న మాచారెడ్డికి వస్తున్న బండి సంజయ్ మహా సంగ్రామ యాత్ర సభకి సంఫీుభావంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.