బోధన్, సెప్టెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో బీజేపీ పార్టీ చెపుతున్నట్లు సెప్టెంబర్-17 విమోచననో లేదా ఇతర పార్టీలు చెబుతున్నట్లు విలీనమో కాదని ముమ్మాటికీ విద్రోహ దినమేనని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు.
గురువారం బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు నైజాం పాలనలో నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కమ్యూనిస్టుల నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారని, దేశముఖ్లు, జాగీర్‌దార్లు, భూస్వాలు, పటేల్, పట్వారీల దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడి మూడు వేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారని, సాంఫీుక దూరాచాలను రూపు మాపారని ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతికేటట్లు చేశారని దీన్ని చూసి భయంతో ఆనాటి ఢల్లీి ప్రభుత్వం నెహ్రూ, పటేళ్లు నైజాంతో కుమ్మకై తెలంగాణకు సైన్యాన్ని 1948 సెప్టెంబర్ 14 న పంపి 17న యుద్దం ముగించిదని అన్నారు.
తరువాత అదే సైన్యం తెలంగాణలో ప్రజలకు అండగా వున్న కమ్యూనిస్టు పార్టీల నాయకులను, కార్యకర్తలను కాల్చి చంపారని, పేదలు స్వాధీనం చేసుకున్న భూములను లాక్కున్నారని, నైజాం భూములు, ఆస్తులు, ఆభరణాలకు రక్షణ కల్పించారని అందుకే ఇది ముమ్మాటికీ విద్రోహ దినమని వివరించారు. సమావేశానికి బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి.మల్లేష్ అధ్యక్షత వహించగా, గుమ్ముల గంగాధర్, బి.నాగమణి, పి. శంకర్,ఆర్.గౌతం కుమార్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో కె.రవి, సీ హెచ్ గంగయ్య, జి.శ్రీను, సూర్యకళ, శాంతక్క, బి.సాయులు, శ్రీను, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.