నిజామాబాద్, సెప్టెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నుండి ప్రత్యేక డ్రైవ్‌తో 18 సంవత్సరాలు నిండిన వారికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం అర్హులు అందరూ కవర్ అయ్యే విధంగా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం జారీ చేసిన ఏ బి సి డి నమూనాలో ఇచ్చిన ప్రకారం ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్‌తో కవర్ అయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని మెడికల్ అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసుకోవాలని ఆదేశించారు.
గురువారం ఆయన సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వ్యాక్సినేషన్ కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలలో కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రస్తుతం ప్రత్యేక డ్రైవ్ సబ్ సెంటర్లలో మున్సిపాలిటీలోని ప్రతివార్డ్ స్థాయిలో డ్రైవ్ నిర్వహిస్తున్నందున రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇక అవసరం లేదని తెలిపారు. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోజువారి కార్యక్రమాలు ఇతర వ్యాక్సినేషన్‌లు యధావిధిగా జరగాలని వాటికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమానికి టీం సభ్యులలో సబ్ సెంటర్లలోను ప్రతి మున్సిపల్ వార్డులోను తప్పనిసరిగా ఒక ఏఎన్‌ఎం లేదా స్టాప్ నర్సు ఉండేవిధంగా చూడాలని తెలిపారు. ప్రతి సెంటర్‌లో రోజు కనీసం వంద మందికి వ్యాక్సినేషన్ జరిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ఖచ్చితమైన ప్రణాళిక రోజువారి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి గ్రామస్థాయి సిబ్బందితో ఇంటింటికి తిరిగి ఆయా కుటుంబాలలో 18 సంవత్సరాలు నిండిన వారిలో వ్యాక్సినేషన్ చేసుకున్నవారు ఇంకా చేయవలసిన వారు తదితర వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి నివాసాలకు ప్రత్యేకంగా స్టిక్కర్లు అతికించాలని పేర్కొన్నారు.
ప్రత్యేక కార్యక్రమాల్లో ఎంపీడీవోలు, ఎంపీడీవోలు, పిహెచ్‌సి సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని ప్రతి ఇంటిని కవర్ చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేయాలని తెలిపారు.
కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ / ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రా, ఇంచార్జ్ డిఎంహెచ్‌వో సుదర్శన్, డిప్యూటీ డిఎం అండ్‌హెచ్‌వోలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.