వేల్పూర్‌లో 10 సెంటర్లలో వ్యాక్సినేషన్‌

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ ఆదేశాలనుసారం కోవిడ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలో 10 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం మండలంలోని 10 ఆరోగ్య ఉప కేంద్రాలలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందని, మండల ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సహకరించాలని తెలిపారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ తీగల రాధామోహన్‌, ఎంపీపీ జమున, జడ్పిటిసి భారతి, ఆర్‌టిఏ మెంబర్‌ రాములు, రైతు సమన్వయ సమితి బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్‌ సామా మైపాల్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ మిట్టపల్లి మైపాల్‌, వైద్య సిబ్బంది సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »