కామారెడ్డి, సెప్టెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్బంగా గురువారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఫనిహారం రంగాచారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భూమి కోసం విముక్తి కోసం 4 వేల మంది కమ్యూనిస్టు యోధులు తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరులయ్యారని, లక్షలాది ఎకరాలు భూ పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఉందని ఆమె అన్నారు.
అలాగే కామారెడ్డి సంబంధించిన రంగాచారి అతి చిన్న వయసులోనే ప్రభుత్వ హై స్కూల్లో చదువుకుని పై చదువులైన ఆర్ట్స్ కోసం హైదరాబాద్ వెళ్లడం జరిగిందన్నారు. అనంతరం మగ్దూం మొయినుద్దీన్‌తో పరిచయం ఏర్పడి అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర రంగాచారిదని ఆమె అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో అనేక మంది అమరులయ్యారని, రాష్ట్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అధికారికంగా 11 నుండి 17 వరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి హైదరాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభ ఉంచాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. బాల్‌రాజ్, సిపిఐ జిల్లా నాయకులు రాజశేఖర్, శ్యామల, రాజమణి, భీమయ్య, ఈశ్వర్, కాసిం, మల్లమ్మ, రేకయ్య, ఎల్లయ్య, గంగయ్య, బాలరాజు, అశోక్, హనుమాన్లు, సాయిలు, ఎల్లవ్వ, రాజవ్వ, నర్సింలు, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.