ఆయా గ్రామాలలో తెరాస గ్రామ కమిటీలు…

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం బాల్కొండ నియోజకవర్గ మంత్రి సూచన మేరకు వేల్పూరు మండల గ్రామ టిఆర్‌ఎస్‌ పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు గురువారం ప్రకటించారు.

మండల సమన్వయ సభ్యులు మాట్లాడుతూ వేల్పూర్‌ మండలంలోని వివిధ గ్రామాల నూతన టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.

వేల్పూర్‌ మండల గ్రామ శాఖ అధ్యక్షులు సామ ప్రతాప్‌, పచ్చల నడుకుడ గ్రామ శాఖ అధ్యక్షులు బైరి రవి, మోతే గ్రామ అధ్యక్షులు చింతపల్లి సుదన్‌, పడగల్‌ గ్రామ శాఖ అధ్యక్షులు, హంస పూర్‌ గ్రామ శాఖ అధ్యక్షులు చదిమెల కిషన్‌, లక్కోర గ్రామ శాఖ అధ్యక్షులు దత్తాత్రి ఎన్నికయ్యారు. అలాగే 18 గ్రామాల టిఆర్‌ఎస్‌ శాఖ అధ్యక్షులను నియమించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్‌ పార్టీ సమన్వయ సభ్యులు జైడి నాగధార్‌, రేగుల రాములు, కొట్టాల చిన్న రెడ్డి,సామ మైపాల్‌, మిట్టపల్లి మైపాల్‌, అల్ల కొండ రాకేష్‌ చంద్ర, మోహన్‌ రెడ్డి, భీమా రాజేందర్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »