నిజామాబాద్, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెలి మెడిసన్ సదుపాయంతో జిల్లా ప్రజలు పిహెచ్‌సి నుండే స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలిసి అవసరమైన వైద్య సలహాలు సూచనలు పొందడానికి మంచి అవకాశం ఏర్పడిరదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో టెలిమెడిసిన్ సదుపాయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ సులభంగా స్పెషలిస్ట్ డాక్టరును కలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన మంచి కార్యక్రమం టెలీ మెడిసిన్ అన్నారు.
పి.హెచ్.సి, సిహెచ్‌సి నుండే పేషెంట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రావలసిన అవసరం లేకుండా వారి సమస్యలు తెలియ చేసినట్లయితే సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్లు పేషెంట్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు చేసిన తర్వాత వారికి మందులు ఏ విధంగా వాడాలో తెలియజేస్తారన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న జిల్లా ప్రజలకు ఇది మంచి అవకాశమని నిజామాబాద్ వరకు రావలసిన అవసరం లేకుండానే టెలీ మెడిసిన్ ద్వారా పేషెంట్ డాక్టర్‌ను చూస్తూ మాట్లాడి వారికి ఉన్న సమస్యలు తెలియజేయవచ్చునని ప్రతి పిహెచ్‌సిలో టెలి మెడిసన్ యొక్క షెడ్యూల్‌ను ఫ్లెక్సీ రూపంలో ప్రజలకు తెలిసే విధంగా ప్రదర్శించాలని వైద్యాధికారులకు సూచించారు.
ఏ రోజు ఏ డాక్టర్ అందుబాటులో ఉంటారో తెలుసుకుని వారు ఆరోజు పిహెచ్‌సికి వచ్చి అందుబాటులో ఉండే సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్‌తో మాట్లాడటానికి అవకాశం ఉంది కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా పిహెచ్‌సి పరిధిలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా సీనియర్ డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ మెడిసిన్ వాడడానికి అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిహెచ్‌సికి వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా వారికి ఉన్న ఇబ్బందులను ముందుగా గుర్తించి డాక్టర్స్ ముందుగా అవసరమైన సూచనలు చేయాలని, షెడ్యూల్ ప్రకారం రోజు వచ్చినట్లయితే ఆ రోజు స్పెషలిస్ట్ డాక్టర్‌తో మాట్లాడి మెడిసిన్ పొందవచ్చన్నారు.
రానున్న రోజుల్లో అన్ని పీహెచ్సీలలో ఈ సర్వీస్ ఎఫెక్టివ్‌గా ఉపయోగించుకునే విధంగా మెడికల్ స్టాప్ చర్యలు తీసుకోవాలని జిజిహెచ్‌లో కూడా మంచి సర్వీస్ ఇస్తున్నారని పిహెచ్‌సి వరకు కూడా పేషెంట్‌కు సర్వీస్ అందించడానికి అవకాశం కలిగిందని జిజిహెచ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సేవలను సిస్టమేటిక్‌గా అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
జిజిహెచ్ అందులో ముందుంటుందని కోరుకుంటున్నానని అన్నారు. మీరు అందించే సేవలు నిరుపేదలకని గుర్తుంచుకోవాలని మీరు రెండు గంటలు ఎఫెక్టివ్‌గా చేస్తూ పేషెంట్లకు మంచి మెడిటేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం క్రోమిషన్‌కు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతి మారాజ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బాలరాజు, ఇంచార్జ్ డిఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, డాక్టర్ వెంకన్న, డా. జలగం తిరుపతిరావు, డాక్టర్ విశాల్, డాక్టర్స్ సరస్వతి, జయ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.