ఆర్మూర్, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని యువజన సమాజ్అధ్యక్షులు జీవి ప్రశాంత్ నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్ వద్ద గల లక్ష్మీనారాయణ మందిరంలో యువజన సమాజ్ ఆధ్వర్యంలో క్షత్రియ పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్టు చెప్పారు.
ఎస్ఎస్కె సమాజ్ అధ్యక్షులు పడాల్ గణేష్ జన్మదినం సందర్బంగా తనవంతుగా 80 మంది పేద ప్రజలకు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన సమాజ్ ప్రధాన కార్యదర్శి కర్తన్ నవీన్, ఉపాధ్యక్షులు దొండీ అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శి విశ్వనాధ్, శీను. రాజేష్, బారడ్ కిషోర్, గుజరాతి సాగర్, పట్టు చేనేత సంఘం అధ్యక్షులు గణేశమ్, పోహార్ శైలేష్, సుకేష్ వర్మ, ఎస్జి రాము, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.