బాన్సువాడ, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రుద్రూర్ మండలానికి సంబంధించిన 46 మందికి కళ్యాణాలక్ష్మి, 13 మందికి షాధిముభారక్ చెక్కులు మొత్తం రూ. 59,06,844 విలువ గల 59 చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు.
కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, రుధ్రూర్ మండల ఎంపీపీ సుజాత నాగేందర్, జెడ్పీటీసీ నారోజి గంగారాం, మండల తెరాసా పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.