గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం చేసిన యువకుడు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలము తుక్కోజి వాడి గ్రామానికి చెందిన రాణి (35) మైత్రి వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేష్‌ ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి రక్తం అవసరం అయినప్పుడు ఎల్లవేళలా కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా సహకరిస్తామని, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినట్లయితే చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చునని అన్నారు.

రక్తదానం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చునని, రక్తదానం చేయాలనుకున్నవారు 9492874006 కి సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సురేష్‌, లక్ష్మణ్‌, రాజు, వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »