బంద్‌కు భవన నిర్మాణ కార్మికుల మద్దతు

బోధన్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 27న జరిగే భారత్‌ బంద్‌కు తెలంగాణ ప్రగతి శీల భవన నిర్మాణ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు నిచ్చి బంద్‌లో పాల్గొంటారని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్‌ తెలిపారు.

గురువారం ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేసే చట్టాలనే కాకుండా కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తూ, 44 చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చిందని వాటికి వ్యతిరేకంగా 27 నాటి బంద్‌ లో రైతులతో పాటు కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని బి.మల్లేష్‌ పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కే. రవి, రాజలింగం, పోశెట్టి, చిట్టిబాబు, నడిపి సుదర్శన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »