నిజామాబాద్, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27న జరిగే భారత్ బంద్ కార్యాచరణ కోసం రాజకీయ పార్టీల సమావేశం ఎన్.ఆర్ భవన్ కోటగల్లీలో జరిగింది. భారత్ బందును జయప్రదం చేయడానికి అన్ని వ్యాపార, వాణిజ్య సంఘాలను, సంస్థలను కలిసి బంద్‌కు సహకరించాలని కోరుతామన్నారు.
సమావేశంలో సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు తాహెర్ బిన్ హుందాన్, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న, రాజన్న, సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గంగాధర్, సిపిఐ (ఎం.ఎల్) నాయకులు గంగుల నర్సయ్య, ఎం.పీ.జే జిల్లా భాద్యులు షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.