కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్ కుటుంబ అసమర్థ పాలనే కారణమని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని అనుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిరదని, కెసిఆర్ కుటుంబానికి 5 ఉద్యోగాలు వస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక నోటిఫికేషన్లు లేక ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల వయోపరిమితిని 58 నుండి 61 కి పెంచడం తుగ్లక్ నిర్ణయమని, టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపట్టడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు రాజ్ కుమార్, నితిన్, ప్రవీణ్, మధు, మహేందర్, అరవింద్, నవనీత్, వరప్రసాద్, పవన్ పాల్గొన్నారు.