కామరెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలో దళిత బంధు పథకం అమలు గురించి సర్వే చేపట్టడానికి అరవై బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండలంలో దళిత బందు పథకం అమలుపై గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 60 బృందాలకు నోడల్ అధికారులను నియమిస్తామని చెప్పారు.
అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్, సిపిఓ రాజారామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.