కామరెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సోమవారం బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.