కామారెడ్డి, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గర్గుల్ పల్లె ప్రకృతి వనం, పాఠశాల ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు.
మొక్కలకు సేంద్రియ ఎరువులు వేయాలని సూచించారు. పాఠశాల పకృతి వనంలో ఉన్న వ్యాయామ పరికరాలను పరిశీలించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ గ్రామంలో 100 శాతం పూర్తిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ రవితేజ గౌడ్, ఎంపీడీవో నాగేశ్వర్, పంచాయతీ కార్యదర్శి సాగర్, ఏపీవో రజిని, అధికారులు పాల్గొన్నారు.