కామారెడ్డి, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం టిఎస్పిఎస్ సభ్యురాలు సుమిత్రానందన్ మొక్కలు నాటారు.
మొక్కల సంరక్షణ బాధ్యతను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిని సరస్వతి, జిల్లా బాల రక్షణ అధికారిని స్రవంతి, సిడబ్ల్యూసి సభ్యురాలు స్వర్ణలత, దోమకొండ సిడిపిఓ రోచిష్మ, అధికారులు పాల్గొన్నారు.