Tag Archives: ssc

భయాందోళనలు వీడితే బంగారు భవిష్యత్తు

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్కాన్‌ పల్లి ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది మరియు గత కొన్ని రోజుల నుండి ఉదయం, సాయంకాలము ప్రత్యేక తరగతులను …

Read More »

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,మోడల్‌ స్కూల్‌, సంక్షేమ స్కూల్స్‌ ప్రిన్సిపల్స్‌, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌లతో నిర్వహించిన విద్యాశాఖ రివ్యూ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, పక్కా …

Read More »

ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలం దృష్ట్యా మొక్కలకు వాటరింగ్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం గాంధారి మండలం పేట్‌ సంగం గ్రామంలో రోడ్డుకిరువైపులా ఉన్న మొక్కలకు కలెక్టర్‌ నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఉష్ణోగ్రత పెరుగుతున్న సందర్భంలో మొక్కలకు ప్రతీ రోజూ నీళ్ళు పోయాలని, మొక్కలను సంరక్షించాలని తెలిపారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా …

Read More »

పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కణబరచాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రాజంపేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. సోమవారం పదవ తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థులు చదువుతున్న తీరును ఆరా తీసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే వార్షిక పరీక్షలో వంద శాతం ఉత్తర్ణత సాధించాలని, శ్రద్ధ పెట్టి చదవాలని …

Read More »

ప్రభుత్వ పాఠశాలలు … ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొని ఉండే అపనమ్మకం క్రమేణా దూరమవుతోంది. ఆర్ధిక స్థోమత లేని పేద కుటుంబాలకు చెందిన పిల్లలే ప్రభుత్వ బడులలో చదువుతారనే భావన చెరిగిపోతూ, ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మధ్య తరగతి వారితో పాటు, సంపన్న శ్రేణికి చెందిన అనేక కుటుంబాలు సైతం తమ బిడ్డల ఉజ్వల …

Read More »

విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ఆర్మూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘం భవనంలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్‌ డివిజన్‌ ఏసిపి కిరణ్‌ కుమార్‌ హాజరై మాట్లాడారు. ఇప్పటినుంచి తమ లక్ష్యం ఎంచుకొని లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలని …

Read More »

నల్ల బ్యాడ్జీలు ధరించి గణిత ఉపాధ్యాయుల నిరసన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి గణితం పబ్లిక్‌ పరీక్ష నందు 6, 9, 11, 14 ప్రశ్నలకు గ్రేస్‌ మార్కులు కలపాలని ప్రభుత్వాన్ని కోరుతూ గణిత ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సంబంధించిన మోడల్‌ ప్రశ్నలు కాకుండా ప్రైవేట్‌ పబ్లిషర్స్‌ ప్రచురించిన పుస్తకాల నుండి ప్రశ్నలను కాపీ చేసి పదవ తరగతి …

Read More »

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్‌ 3 నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై బుధవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేనలతో …

Read More »

నేటి విద్యార్థే రేపటి భావితరాలకు మార్గదర్శకులు

రెంజల్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి దశనే భావితరాలకు బాటలు వేసేందుకు ఉపయోగపడుతుందని జన వికాస్‌ సేవా సంస్థ అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి అన్నారు. శుక్రవారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జనావికాస్‌ సేవ సంస్థ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పరీక్షా అట్టలు,పెన్నులు, వాటర్‌ బాటిళ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు …

Read More »

కల్లడిలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం

నిజామాబాద్‌ రూరల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్లడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతికి చెందిన విద్యార్థులు 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ కార్యకమ్రం నిర్వహించారు. కల్లడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గంగోల్ల ప్రళయ్‌ తేజ్‌ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నందున విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, జామెట్రి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »