బోధన్, సెప్టెంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు, వారికి పీఆర్‌సీ తరహా నిర్ణయాత్మక ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన ను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 13 న గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్‌కు పిలుపు నివ్వడం జరిగిందని, దానిలో గ్రామ పంచాయతీల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్ పిలుపునిచ్చారు.
గురువారం ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలంలోని ఎడపల్లి, జమలం, బాపునగర్, పోచారం తదితర గ్రామాల్లో గ్రామ పంచాయతీ సెక్రెటరీలను కలసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బి.మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల మంది కార్మికులు, ఉద్యోగులు వివిధ కేటగిరీల క్రింద పనిచేస్తున్నారని, వారికి మల్టీపర్పస్ వర్కర్ పేరుతో అనేక పనులు చేయిస్తున్నారని, కొన్ని గ్రామాల్లో పండుగ దినాలలో ఆదివారపు సెలువులలో కూడ పనులు చేస్తున్నారని ఈ పద్ధతులను విరమించుకోవాలని అన్నారు.
కేటగిరీల వారీగా విభజించి వేతనాలు పెంచి, పర్మినెంట్ చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్‌లను స్పెషల్ స్టేటన్ కల్పించి వారిని పంచాయతీ అసిస్టెంట్‌లుగా నామకరణ చేయాలని అన్నారు. పీఎఫ్, ఈ.ఎస్. ఐ సదుపాయాలతో పాటు ఇతర సమస్యల ను పరిష్కరించాలని బి.మల్లేష్ డిమాండ్ చేశారు. సమావేశంలో ఐఎఫ్‌టీయూ నాయకులు కే. రవి, గోపీ, పోశెట్టి, బాబు, భూమయ్య, సిబ్బంది పాల్గొన్నారు.