న్యూస్ డెస్క్
తెలంగాణను వానలు ముందే పలకరించాయి. అరేబియా సముద్రంలో వాయుగుండం కారణంగా సోమవారం నుంచే వానలు కురుస్తున్నాయి. మరోవైపు రుతు పవనాలు సైతం జూన్ రెండోవారంలో రాష్ట్రనికి రానున్నాయన్న వార్త రైతులను సంతోషపెడుతోంది. ఇప్పటికే నైరుతీ రుతుపవనాలు కేరల ను తాకాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తుఫాను తో నేడు రేపు వర్షాలు..
నిసర్గ తుఫాను ప్రభావం వల్ల నేడు, రేపు వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది.అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈతుఫాను మంగళవారం తీవ్ర రూపం దాల్చి, ఈశాన్య దిక్కున పయనించి జూన్ మూడు నాటికి మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లా హరిహరేశ్వర్, దమణ్ ల మధ్య తీరాన్ని తాకే అవకాశాలున్నాయి.