కామారెడ్డి
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను కామారెడ్డి బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపాదికన కొట్లాడిన తెలంగాణ ప్రజానీకానికి కొత్తగా ఒరిగిందేమి లేదని ముఖ్యంగా కామారెడ్డి నియోజక వర్గానికి అన్ని రకాలుగా అన్యాయం జరిగిందని అన్నారు. స్వరాష్ట్ర ఆకాక్ష నెరవేరిన తరువాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల తో కామారెడ్డి నియోజకవర్గములో ఒక్క సెంటు భూమికి కూడా అదనంగా నీరంద లేదని, నిధుల విషయంలో కూడా కామారెడ్డి తీవ్రంగా నష్ట పోయిందన్నారు. జిల్లా కేంద్రం అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, పార్టీకీ చెందిన కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గోన్నారు