జెస్సికాలాల్ హత్య కేసు…మను శర్మవిడుదల

రెండు దశాబ్ధాల నాటి సంచలన కేసు ..జెస్సికా లాల్ హత్య కేసులో మనుశర్మ జూన్ 1 న జైలు నుంచి విడుదలయ్యాడు. సత్ప్రవర్తన కారణంగా అతనికి శిక్ష తగ్గించారు. అప్పట్లో తీవ్ర సంచలనానికి కారణమైన కేసులో మను శర్మ 14 ఎళ్ల పాటు జైలు జీవితం అనుభవించాడు. హర్యానాకు చెందిన కాంగ్రేస్ నాయకుడు వినోద్ శర్మ కుమారుడు మనుశర్మ అలియాస్ సిద్దార్థ వషిష్ట. ఢిల్లిలోని ఓ బార్ లో తనకు లిక్కర్ అందిచలేదన్ననెపంతో జెస్సికాలాల్ ను 30 మే 1919 రోజు కాల్చి చంపినట్టు నేరం రుజువైంది. సంచలన కేసులో 2006లో మనుశర్మకు యావజ్జీవ ఖైదు పడింది. 2010 లో సుప్రీం కోర్టు శిక్ష ఖరారు చేసింది తొలుత సెషన్స్ కోర్టులో కేసు మనుశర్మకు అనుకూలంగా వచ్చినప్పటికీ హైకోర్టు శిక్ష విధించడం, సుప్రీ కోర్టు సమర్థించడంతో జైలుకు వెళ్లాడు.

అప్పడు మను శర్మకు శిక్ష పడేందుకు.. ఇప్పుడు శిక్ష తగ్గించి విడుదల చేయించేందుకు మీడియా కాంపేయిన్ నడిచింది. చివరకు జెస్సికా సోదరి సబ్రినాలాల్.. మనుశర్మను విడుదల చేసినా తమకు అభ్యంతరం లేదని ఏప్రిల్ 2018 సమ్మతి తెలిపారు.

మొదటి నుంచి సంచలనమే…

కేసులో శిక్ష పడేలా చేయడానికి నాడు ప్రాసిక్యూషన్ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముఖ్య సాక్షులు సహకరించక పోవడం అడ్డంకిగా మారింది. ప్రదాన సాక్షిగా ఉన్న శాయన్ మున్షీ తో పాటు పలువురు కేసుకు అడ్డం తిరిగారు. మాలిని రమని, బినా రమని అనే ఇద్దరు సాక్షులు, కేసులో మనుశర్మను గుర్తించారు. అయినప్పటికీ ట్రయల్ కోర్టులో మను శర్మకు శిక్ష పడలేదు. కేసులో తొమ్మిది మంది ముద్దాయిలను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది. డిసెంబర్ 2006 లో ఢిల్లీ పోలీసులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. హైకోర్టు మనుశర్మతో పాటు వికాస్ యాదవ్, అమర్ దీప్ సింగ్ గిల్ అలియాస్ టోనీలకు శిక్ష విధించింది. మిగితా వారిని నిర్ధోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. మనుశర్మకు జీవితఖైదు, ఐదు వేల రూపాయల జరిమాన, మిగితావారికి ఐదు ఏళ్ల కారాగార శిక్ష, మూడు వేల రూాపాయల జరిమాన విధించింది. సుప్రీ కోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది.

Check Also

లక్షకు చేరువలో….

Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »