విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆందోళన తెలుపుతూ లేఖ రాశారు.
జూన్ 8 వరకు పంట కొనుగోలు కేంద్రాలు కొనసాగింపు
రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మొదట మే 31 వరకు కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు జూన్ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వర్షాలు రాక ముందే రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అమ్ముకోవాలని సీఎం కోరారు.