:సింగరేణి గనులో విషాదం అలుముకుంది. బ్లాస్టింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రామగుండం 3, ఓపెన్ కాస్ట్ గని ఫేజ్ 1 లో పెను ప్రమాదం సంబవించింది. బ్లాస్టింగ్ కు సంబంధిచిన పేలుడు పదార్ధాలు నింపుతుండగా ఓక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కార్మికుల శరీరాలు చిధ్రమయ్యాయి. సంఘటనలో గాయపడిన వారిని గోదావరిఖని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో కమాన్ పూర్ నకు చెందిన రాజేశ్,అంజయ్య,గోదావరిఖని చెందిన ప్రవీణ్, రాకేశ్ ఉన్నారు. వీరంతా 30 ఏళ్ల లోపు యువకులే. రామగుండం పోలీస్ కమీషర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.