జూన్ 2, 2020.
హైదరాబాద్.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.జాతీయ జెండాను ఆవిష్కరించారు మొదటగా శాసనసభ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన..
తెలంగాణ రాష్ట్ర 6వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.దశాబ్ధాల పోరాటం, అమరవీరుల బలిదానాలు, కేసీఆర్ మడమతిప్పని పోరాట ఫలితమే కోట్లాది మంది తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను నెరవేర్చిందన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ది, సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం దేశంలోనే ఏ రాష్ట్రం చేపట్టని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ దేశంలోని మిగతా రాష్ట్రాల శాసనసభలకు ఆదర్శంగా ఉన్నదన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు MLC లు, శాసనసభ కార్యదర్శి డా వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.