11 నుంచి దర్శన భాగ్యం
ఏడు కొండల వాడి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నేపథ్యంలో రెండునెలలగా భక్తుల దర్శనానికి దూరంగా వెంకటేశుని సన్నిధికి ఈ నెల11 నుంచి భక్తులను అనుమతించనున్నారు. దర్శనానికి భక్తులను అనుమతించాలని ఆలయ ఈఓ రాసిన లేఖకు స్పందిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.ఎస్. వీ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. బౌతిక దూరాన్ని పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.