Daily Archives: June 3, 2020

తీరాన్ని తాకిన ‘నిసర్గ’ తుపాను

మహారాష్ట్ర: రాయగడ్‌ జిల్లాలోని అలీబాగ్‌ వద్ద ‘నిసర్గ’ తుపాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నారు. తుపాను తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పలు గ్రామాల ప్రజలను  ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. రాయ్‌గఢ్‌ జిల్లాలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను దృష్ట్యా కొన్ని రైళ్లు …

Read More »

పెద్దపల్లి, జగిత్యాలలో భారీ వర్షం

పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో చెట్టుపై పిడుగు పడడంతో ఆవుల భూమయ్యకు చెందిన 33 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడిని ఆదుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హామీ ఇచ్చారు. ఖిలావనపర్తిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని 3 చెట్లు పడి పోవడంతో ప్రహరీ కూలింది. పలు ప్రదేశాల్లో ఆరు విద్యుత్‌ …

Read More »

కరోనాను కట్టడి చేశాం..జెడ్పి చైర్మన్.

జిల్లాలో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో అత్యధికంగా 61 కేసులు నమోదయినప్పటికి, అతి తక్కువ సమయంలో కరోనాను కట్టడి చేయగలిగామని జెడ్పీ ఛైర్మన్ దాదన్నగారి మధుసూదన్ రాంవు అన్నారు. బుధవారం నిజామాబాద్ ‌ జిల్లా ప్రజా పరిషత్‌ మూడవ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్‌ సమావేశ హాలులో జరిగింది.కరోనా వ‌ల్ల‌ సర్వసభ్య సమావేశం నిర్వహించడం ఆల‌స్యం అయిందన్నారు. సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి చేసిన జిల్లా కలెక్టర్‌, వారి యంత్రాంగానికి …

Read More »

రైట్..రైట్…రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.

రెండున్నర నెలలుగా డిపోలకే పరిమితమైన హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ నెల 8వ తేది నుంచి వాటిని తిప్పడానికి అనుమతి లభించినట్టు సమాచారం. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సిటీ, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరుచ అయితే, ప్రజా …

Read More »

న్యాయమూర్తికి కరోనా..

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రోహిణి కోర్టుకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఆ కోర్టులోని జడ్జికి పాజిటివ్ తేలింది. దీంతో న్యాయస్థానం ఉలిక్కిపడింది. దీంతో న్యాయవాదులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నాయి. జడ్జి భార్యకు మొదట వైరస్ సోకింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. దాంతో కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించడంలో భాగంగా జడ్జికి కూడా పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో అతడికి వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. జడ్జితో పాటు …

Read More »

ధర లేని పంటలు వద్దు ..సిఎం కేసీయార్

మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని సిఎం ఆకాంక్షించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం …

Read More »

సీఎం బండికీ ట్రాపిక్ చలనా

రయ్ మని దూసుకు పోయే సి ఎం వాహనానికి తప్పలే చలాన్ బెడద. లతివేగంగా వెళ్లినందుకు ముఖ్యమంత్రి వాహనానికీ ట్రఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అతి వేగానికి సంబంధించి నాలుగు చాలన్లు పెండింగ్ లో ఉండడంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వాటిని చెల్లించారు. నాలుగు చలాన్లకు సంబంధించి రూ.4,140 చెల్లించారు. హైదరాబాద్ లో రెండు సైబరాబాద్ లో ఒకటి సూర్యాపేట జిల్లాలో మరో ఫైన్ విధించారు. గతేడాది అక్టోబర్ 16న కోదాడ …

Read More »

అంతరాష్ట్ర ప్రయాణాలకు నో పాస్

ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇకపై డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి డీజీపీ పోలీసు శాఖ పాసులు జారీ చేసేది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్ర …

Read More »

లాభాల బాటన స్టాక్ మార్కెట్లు.

 2 జూన్ 2020  దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుసగా ఆరంభ భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ చివరకు సెన్సెక్స్ 34100కు ఎగువన, నిఫ్టీ 10వేల స్థాయికి ఎగువన ముగియడం విశేషం. సెన్సెక్స్ 284 పాయింట్ల లాభంతో  ​​34109 వద్ద, నిఫ్టీ 82పాయింట్లు ఎగిసి 10061 ముగిసింది. బ్యాంకింగ్, ఆటో ఎఫ్‌ఎంసీజీ, ఫార్మాషేర్ల  లాభాలు దలాల్ స్ట్రీట్ ర్యాలీకి మద్దతునిచ్చాయి. మరోవైపు మెటల్, ఐటీ స్వల్పంగా నష్టపోయాయి.ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, …

Read More »

గులాబి గూటికి వలసల జోరు

కామారెడ్డి. కామారెడ్డి నియోజక వర్గంలో రాష్ట్ర సమితిలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ మారారు. మండల జెడ్పీటీసీ తీగల తిర్మల్ గౌడ్, బిక్కనూరు జెడ్పీటీసీ పద్మనాగభూషణం గౌడ్, దోమకొండ వైస్ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, సర్పంచ్ అంజలి శ్రీనివాస్, సిద్ధరామేశ్వరనగర్ ఎంపీటీసీ మీనా దుర్గాబాబు టీ ఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »