కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్…కు స్థలం చూపాలని బిజెపి ఆద్వర్యం లో బుదవారం ఆందోళన చేశారు. కొద్ది రోజుల క్రితం డైలీ మార్కెట్ నుండి గంజ్ లోకి మార్చారు. అనంతరం కరొనా నేపథ్యంలో నిన్నటి వరకు క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాలు లో నిర్వహించారు. లాక్ డౌన్ ఎత్తి వేశారని క్లాసిక్ గోల్డెన్ యాజమాన్యం తాళం వేసింది. ఇటు గంజ్ గేటు కు కూడా తాళం వేయటం తో తమ కూరగాయలను ఎక్కడ అమ్ముకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో రైతులు గంజ్ గేటు వద్ద గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, వచ్చి గంజ్ గేటు తాళాలు తీసి మార్కెటును గతంలోలా యథాతథంగా నిర్వహించటానికి అనుమతించారు .
ఈ సందర్బంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ కామారెడ్డి పరిసర ప్రాంతాల రైతులు ఎంతో కస్టపడి పండించిన కూరగాయలను అమ్ముకోవటానికి జాగా కూడా లేకుండా పోయిందని. మున్సిపల్ అధికారులు రోజుకో దగ్గర అమ్ముకోవాలని ఆదేశిస్తూ వాళ్ళను క్షోభకు గురి చేస్తున్నారని, జిల్లా కేంద్రం ఆయన కామారెడ్డి లో గతంలో ట్రాఫిక్ ను సాకుగా చూపి డైలీ మార్కెట్కూ నుండి గంజికి తరలించారని యిప్పుడు అక్కడ కూడా ఇబ్బంది పెడుతున్నారని మార్కెట్ కు శాశ్వత పరిస్కారం చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో కౌన్సిలర్లు మోటూరి శ్రీకాంత్, పండ్ల ప్రవీణ్, అవదూత నరేందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.