దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రోహిణి కోర్టుకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఆ కోర్టులోని జడ్జికి పాజిటివ్ తేలింది. దీంతో న్యాయస్థానం ఉలిక్కిపడింది. దీంతో న్యాయవాదులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నాయి. జడ్జి భార్యకు మొదట వైరస్ సోకింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. దాంతో కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించడంలో భాగంగా జడ్జికి కూడా పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో అతడికి వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. జడ్జితో పాటు అతడి భార్య క్వారంటైన్ కు వెళ్లారని రోహిణి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహవీర్ సింగ్ తెలిపారు. శనివారం జడ్జి కోర్టును సందర్శించారు. జడ్జికి కరోనా ఉందనే వార్త న్యాయస్థానాల్లో చర్చనీయాంశంగా మారింది. వైరస్ సోకిన విషయం తెలిసిన వెంటనే న్యాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా రోహిణి కోర్టు సముదాయ భవనాన్ని మూసేసి మొత్తం శానిటైజ్ చేశారు. ఆయన సహచర న్యాయమూర్తులు, ఇతర కోర్టు సిబ్బంది అందరికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో న్యాయస్థానాలని ఆన్ లైన్ ద్వారానే విచారణ జరుపుతున్నాయి. అత్యవసర కేసులు మినహా మిగితా కేసులు విచారణకు స్వీకరించడం లేదు.
Check Also
లక్షకు చేరువలో….
Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …