ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇకపై డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి డీజీపీ పోలీసు శాఖ పాసులు జారీ చేసేది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అంతర రాష్ట్ర ప్రయాణాలకు అనుమతించింది. దీంతోో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంద్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన వారు యాప్‌లో, కర్ణాటకకు వెళ్లేవారు ఆ రాష్ట్రానికి చెందిన సేవా యాప్‌లోనూ, మహారాష్ట్రకు వెళ్లేవారు ఆ రాష్ట్ర పోర్టల్‌లో ప్రయాణికుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది
Check Also
లక్షకు చేరువలో….
Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …